ఉదయాన్నే మీ పార్టనర్‌తో రొమాన్స్‌ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదట..

-

అలారం సౌండ్‌కు లేచి హడావిడిగా పనులు చేసుకుని ఉద్యోగాలకు పరుగులు తీసే వాళ్లం.. ఈ బిజీలైఫ్‌లో భార్యాభర్తలకు రాత్రే సరిగ్గా మాట్లాడుకోవడానికి టైమ్‌ దొరకడం లేదు.. సెక్స్‌ను షెడ్యూల్‌ చేసుకునే వాళ్లు ఉన్నారు. అలాంటిది.. ఉదయం లేవడంతోనే సరసాలంటే ఎక్కడ అవుతుంది.. కానీ మీకు తెలుసా.. ఉదయం మీ పార్ట్‌నర్‌తో రొమాన్స్‌ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు..

మార్నింగ్‌ లేవగానే పార్టనర్‌తో రొమాన్స్‌ చేస్తే…. మీ భాగస్వామితో. సంబంధం దృఢంగా ఉంటుంది. రోజంతా హ్యాపీగా ఉంటారు. డే స్టాట్స్‌ విత్‌ సెక్స్ అంటే.. చాలా మందికి ఆశ్యర్యంగా అనిపించవచ్చు.. కానీ ఇది మీ లైఫ్‌స్టైల్‌ మీద చాలా గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఆరోజంతా చురుగ్గా పనిచేస్తారు. మన మూడ్‌ చిరాకు లేకుండా ఉంటే.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టి ఒత్తిడి లేకుండా చేయొచ్చు. ఇంకా ఈరోజుల్లో వ్యాయామాలు చేసే అంత ఓపిక, తీరిక చాలామందికి ఉండటం లేదు.. అదే మార్నింగ్‌ సెక్స్‌ చేస్తే మీరు వర్కౌట్‌ చేసిన దాంతో సమానమే..! ఉదయం పూట సెక్స్ చేయడం వలన.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అందుకే మార్నింగ్ శృంగారం మంచిదని నిపుణులు చెబుతారు.
ఉదయం సమయంలో రొమాన్స్ చేస్తే బ్లడ్‌ సర్యూలేషన్‌ బాగుంటుంది. బాడీలో రక్తం బాగా సరఫరా అయిందంటే.. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ముఖం కూడా మెరిసిపోతుంది.

సెక్స్ ఆరోగ్యానికి మంచిది. ఇది కేవలం రాత్రి చేయడానికే అని అందరూ అనుకుంటారు.. కానీ ఉదయం చేస్తే.. జిమ్ చేసినంత వర్కౌట్ అవుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పురుషుల శరీరం, మనసు ఉదయం వేళల్లో సంభోగం చేసేందుకు సిద్ధంగా ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.. ఈ కారణంగా పురుషులు ఉదయం సెక్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. దీనితో వారి పార్టనర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. కానీ మహిళలు ఎక్కువగా ఈ సమయంలో ఇష్టపడరు అని చెబుతారు. కానీ సమయంలో రొమాన్స్, శృంగారం చేస్తే.. ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news