హైదరాబాద్ టు రాజస్థాన్.. ఈ IRCTC ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే..!

-

ఐఆర్సీటీసీ ఎన్నో ప్యాకేజీలని తీసుకు వస్తోంది. అలానే ఐఆర్సీటీసీ రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలని చూపించేందుకు ఓ టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇది మొత్తం 5 రాత్రులు, 6 రోజుల టూర్. ఇక ఈ టూర్ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం. ఈ టూర్ ద్వారా మీరు జైసల్మేర్, జోధ్‌పూర్, మౌంట్ అబు, ఉదయ్‌ పూర్ వంటి ప్రదేశాలను చూసి వచ్చేయచ్చు. ఫిబ్రవరి 11న హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఈ టూర్ మొదలు అవ్వనుంది.

ఉదయం 8:45 గంటలకు ఉదయ్‌పూర్‌ స్టార్ట్ అయితే 10:30 గంటలకు రీచ్ అవుతారు. తిరిగి 16వ తేదీన జోధ్‌పూర్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి రీచ్ అవుతారు. బేసిస్‌లో ముగ్గురు కలిసి వెళితే తక్కువ ధరకే వెళ్లి వచ్చేయచ్చు. మొదటి రోజు సిటీ ప్యాలెస్, సాహేలీ కి బారీ, ఫతేహ్ సాగర్ లేక్ చూడచ్చు. మరుసటి రోజు ఉదయం మౌంట్ అబూకు వెళ్ళాలి.

అక్కడ దిల్వారా జైన్ టెంపుల్ చూడచ్చు. అలానే నక్కీ లేక్ చూపిస్తారు. మూడో రోజు ఉదయం మౌంట్ అబు నుండి జైసల్మేర్‌కు తీసుకు వెళ్తారు. జైసల్మేర్ కోట, సహారా ఎడారిని చూడచ్చు. క్యాంపింగ్ ఏర్పాటు ఉంటుంది. ఒంటెపై ప్రయాణించొచ్చు. జీప్ సఫారీ కూడా. కానీ వీటికి మీరే పే చెయ్యాల్సి వుంది. ఐదో రోజు జోధ్‌పూర్ చేరుకుంటారు.

విజిటింగ్ స్పాట్ ఉమైద్ భవన్ ప్యాలెస్ చూసి… రాత్రికి అక్కడే స్తే చెయ్యాలి. మరుసటి రోజు మేహ్రాన్‌గర్హ్ కోట చూడచ్చు. జోధ్‌పూర్ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం హైదరాబాద్ రీచ్ అవుతారు. ఒక్కరే సింగిల్‌గా వెళ్తే రూ.41,850 పే చెయ్యాలి. డబుల్ షేరింగ్‌లో అయితే ఒక్కొక్కరు రూ.32,750 చెల్లించాల్సి. ముగ్గురు వెళ్లాలనుకుంటే రూ.31,700 చెల్లించాలి. 2 నుండి 11 ఏళ్ల పిల్లలకైతే రూ.27,900‌గా వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news