ఒకప్పుడు పెళ్ళి చేసుకోవాలంటే తెలిసిన వాళ్ళో, ఇంకొకరో పలనా అమ్మాయి లేదా అబ్బాయి గురించి చెప్పేవాల్లు..ఆ తర్వాత పెళ్లిళ్ల పేరయ్యలు వచ్చారు.అబ్బాయికి నచ్చిన అమ్మాయిని చూపించి పెళ్ళిళ్ళు చేసేవాల్లు.ఇప్పుడు ట్రెండ్ మారింది.అంతా ఆన్ లైన్ మాయం.. అందులో డీటైల్స్ ఉంటాయి. నచ్చిన అమ్మాయి, అబ్బాయి వివరాలు తెలుసుకోవడం పెళ్ళి చేసుకోవడం.. ఇన్ని ఉన్నా కూడా ఓ వ్యక్తికి పెళ్ళి కాలేదట..దాంతో అతడు ఓ యాడ్ ను ఇచ్చాడు.అదికాస్త వైరల్ అయ్యింది.
ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ మంచి జీతం పొందుతున్న 27 ఏళ్ల యువకుడుకి పెళ్లిపై మనసైంది.. తగిన జోడు కోసం బాగానే ప్రయత్నాలు చేశాడట.. అయినా.. ఎవరూ దొరకకపోవడంతో.. అతడికి ఓ ఐడియా వచ్చింది.. దాంతో.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నంబర్ , ఫొటో, అడ్రస్.. ఇలా అన్నీ పొందుపరుస్తూ.. ఓ పోస్టర్‌ను డిజైన్ చేయించాడు.. ప్రింట్ వేయించి అక్కడక్క అంటించాడు.. ఇప్పుడా పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
వివరాల్లొకి వెళితే.. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని మదురైలో భార్య కావాలంటూ ఎక్కడా చూసినా పోస్టర్లు దర్శమనిస్తున్నాయి.. మదురైలో ఉంటున్న 27 ఏళ్ల జగన్.. ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడట.. ఇక, పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన జగన్.. ఐదేళ్లుగా తనకు కాబోయే జీవిత భాగస్వామి కోసం వెతకడం మొదలు పెట్టాడట.. అయినా.. అతడి ప్రయత్నాలు ఫలించలేదు.. దీంతో, అతడికి ఓ ఐడియా తట్టింది.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ వెల్లడిస్తూ.. తన ఫొటో కూడా వచ్చేలా చూసుకుంటూ.. ఓ పోస్టర్ రూపొదించాడు..పోస్టర్లు వైరల్ అయ్యాయి.. కానీ పెళ్ళి మాట వినిపించలేదు. ఒక అమ్మాయి అయిన పోస్టర్ ను చూసి వస్తుందేమో..