రియల్‌ మసూద.. క్లాస్‌రూమ్‌లో ఆ అరుపులతో పిచ్చెకిచ్చిన విద్యార్థి

ఇంటర్నెట్‌లో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టే వీడియోలు చూస్తే.. ఇవి కావాలనే చేశారా లేక అలా జరిగిందా అని కూడా కొన్నిసార్లు ఊహించలేం.. రీసెంట్‌గా వచ్చిన మసూద మూవి మీరు చూసే ఉంటారు.. అమ్మో..థియేటర్లో చూస్తే ఒక్కొక్కరికి చెమటలు పట్టాయి.. ఆధ్యాంతం నెక్ట్స్‌ ఏం జరుగుతుందా అన్నట్లు జనాలకు బాగా నచ్చిన మూవి అది.. అందులో పాపకు దెయ్యం పట్టినప్పుడు ఎలా చేసిందో ఆ సీన్‌ గుర్తుందా..? సరిగ్గా అలానే జరిగింది ఓ అమ్మాయికి.. చెప్పాలంటే.. అంతకంటే ఎక్కువే.. ఈ వీడియో చూస్తే.. మసూద దెయ్యం ఈ అమ్మాయికు పట్టిందా అనిపిస్తుంది..

వైరల్‌ అవుతున్న వీడియోను బట్టి చూస్తే.. అది ఒక తరగతి గదిలా ఉంది. అందరూ స్టూడెంట్స్‌ ఉన్నారు. అందులో ఒక అమ్మాయి..విచిత్రంగా, వింతంగా ప్రవర్తిస్తుంది. మసూద మూవిలో ఎలా అయితే ఆ అమ్మాయి చేస్తుందో.. అంతకంటే ఘోరంగానే చేస్తుంది. అరుస్తుంది. పైకి ఎలా అంటే అలా లేస్తుంది. పక్కన ఉన్న తన స్నేహితులు ఆమెను కంట్రోల్‌ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఆమె ఆగడం లేదు. పిచ్చి పిచ్చిగా తన శరీరాన్ని తిప్పేస్తుంది.

ఈ వీడియోకు ఇప్పటికే 75. 4k వ్యూస్‌ వచ్చాయి. కమెంట్స్‌ అంతే ఇంక హద్దులే లేదు.. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి షాక్‌ అయ్యారు. తనను దేవుడై కాపాడాలని కొందరు కమెంట్‌ చేస్తుంటే.. తనకు నిజంగానే దెయ్యం పట్టిందని ఇంకో నెటిజన్‌ కమెంట్‌ చేశారు. తను చాలా క్రిటికల్‌ కండీషన్‌లో ఉందని, తనని ఆ అల్లానే కాపాడాలని ఇంకో నెటిజన్‌ కమెంట్‌ చేశారు. ఇది ఫేక్‌ అని మాత్రం నెజిటన్లు కూడా అనడం లేదు.. వీడియో చూసి మీకు ఏం అనిపిస్తుందో చెప్పండి.!

https://www.instagram.com/reel/CmROxQAgjWr/?igshid=YmMyMTA2M2Y=