‘స్నేక్‌ వైన్‌’ ఒక మంచి సెక్స్‌ డ్రైవ్‌.. చాలా ఫేమస్‌.. కానీ ఎవరికీ తెలియదు

-

చైనా వాళ్లు ఏది పడితే అది తింటారు.. ఎగిరేవి, పాకేవి, గెంతేవి అని తేడా లేకుండా అన్ని జంతువులను ఆరగిస్తారని మనకు బాగా తెలుసు.. కానీ పాముతో వైన్‌ చేసుకుని తాగుతారని మాత్రం మీరు ఊహించి ఉండరు.. ‘స్నేక్ వైన్‌’. అవును పేరులోనే అర్థం ఉంది.. పాములతో తయారు చేసే వైన్‌ ఇది. దీనిని చైనీస్ భాషలో పిన్యిన్ అని అంటారు. వియత్నామీస్ భాషలో ఖ్మెర్ అని పిలుస్తారు. ఇది ఆల్కహాలిక్ డ్రింక్. దీన్ని రైస్ వైన్ లేదా గోధుమల వైన్‌లో పాములను కలిపి తయారుచేస్తారు. ఇది మంచి సెక్స్‌ డ్రైవ్‌గా వాడేవాళ్లట..!

ఈ పానీయాన్ని మొదటిసారిగా క్రీస్తుపూర్వం 200 సంవత్సరంలో పశ్చిమ జౌ రాజవంశం కాలంలో తయారుచేశారు. ఆ తర్వాత చైనాలో పాపులర్ అయింది. ఈ మద్యాన్ని చైనా సంప్రదాయ వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారు. చైనాతో పాటు ఉత్తరకొరియా, వియత్నాం, ఒకినావా (జపాన్), లావోస్, థాయిలాండ్, కంబోడియా ఆగ్నేయాసియాలో దీన్ని తయారు చేస్తారు. పాత రోజుల్లో చాలా దేశాలలో దీన్ని తయారుచేసేవాళ్లట..కీటకాల కాటు, వాతం తగ్గేందుకు నివారణగా మార్కెట్లలో ఈ వైన్ అమ్మేవారు.
కుష్టు వ్యాధి, అధిక చెమట, జుట్టు రాలడం, పొడి చర్మం వంటి అనేక ఇతర వ్యాధుల చికిత్సలో ఈ వైన్‌ని సాంప్రదాయ ఔషధంగా ఉపయోగించారు. దీన్ని టానిక్‌గా భావించేవారు.

ఎలా చేస్తారంటే..

ఈ వైన్ ఇప్పటికీ కంబోడియా, చైనా, జపాన్, కొరియా, లావోస్, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల్లో రోడ్‌సైడ్ స్టాల్స్‌లో కనిపిస్తుంది. ఒక సీసాలో పామును ఉంచి బియ్యం లేదా గోధుమల్ని పోస్తారు. అలాగే ఆల్కహాల్, ఫార్మాల్డిహైడ్ కూడా కలుపుతారు. వియత్నామీస్ సంస్కృతిలో పాము ‘వెచ్చదనం’, మగతనానికి చిహ్నం. స్నేక్ వైన్ అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. కామ కోరికల్ని పెంచే శక్తిమంతమైన కామోద్దీపనగా దీన్ని ఉపయోగిస్తారు.

విదేశీయులు చైనా, హాంకాంగ్‌లకు వస్తే, ఈ వైన్‌ని వారికి కచ్చితంగా చూపిస్తారు. ఐతే.. ప్రస్తుతం స్నేక్ వైన్‌ని వాడేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. బియ్యం లేదా గోధుమలతో బతికివున్న పామునే సీసాలో కొన్ని నెలలపాటూ ఉంచుతారు. అది చనిపోయి.. కుళ్లిపోయి.. ఈస్ట్‌కి ఆహారం అవుతుంది. ఆ ఈస్ట్ క్రమంగా ఆల్కహాల్‌గా మారుతుంది

ఆధునిక అధ్యయనాలు.. స్నేక్ వైన్‌లో అనాల్జేసిక్ (నొప్పి నివారిణి), యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని కనిపెట్టాయి..నిజానికి ఇది కొన్ని వ్యాధులకు మంచిదని సూచిస్తున్నాయి. ఇది తాగడానికి సురక్షితమేనా అంటే అది పెద్ద ప్రశ్నే.. మనం అయితే అసలు తాగలేం.. అక్కడి వారు అయితే దీన్ని తాగొచ్చు అన్నదే సమాధానం. రైస్ వైన్‌లోని ఇథనాల్… పాములోని విషాన్ని చంపేస్తుంది.

స్నేక్ వైన్ సాధారణంగా చైనాలోని మార్కెట్లు, సాంప్రదాయ పాము రెస్టారెంట్లలో కనిపిస్తుంది. దీనిని సె-వాంగ్ అని పిలుస్తారు. చైనాలో పాములను తినే పాత ఆచారం ఉంది. సాధారణంగా స్నేక్ వైన్ తయారీకి ఎక్కువ విషపూరితమైన పాముల్ని ఉపయోగించరు. అయినప్పటికీ స్నేక్ వైన్‌ తాగడం ప్రమాదకరమనే కొందరు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version