మరోసారి డ్యాన్స్ తో అదరగొట్టిన స్పైస్ జెట్ ఎయిర్‌హోస్టెస్..వీడియో వైరల్

-

సోషల్ మీడియాలో రోజుకు ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి..కొన్ని వీడియోలను చూసి మనం కూడా వావ్ అనకుండా ఉండలేం. అలాంటి వీడియోలు వేళ్ల మీద లెక్కబెట్టేలా ఉంటాయి. ఇలా తమ పర్ఫామెన్స్‌తో అందరి మనసులనూ గెలుచుకున్న వారు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన సందర్భాలను మనం అనేకం చూశాం. అలాంటి వారిలో ఒకరైన స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి వేసిన స్టెప్పులు ఇంటర్‌నెట్‌లో మరోసారి వైరల్‌గా మారాయి. ఈ స్టెప్పులను చూసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయకుండా ఉండలేరు..

ఇప్పటికే తన వైరల్ స్టెప్పులతో పెద్ద స్టార్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఉమ వేసిన స్టెప్స్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి..ఆమె వేసే డ్యాన్స్ కు చాలామంది ఫిధా అయ్యారు.అలా అమ్మడు పాపులర్ అయ్యింది.సింగర్ యోయో హనీసింగ్ పాడిన ఆల్కహాలిక్ పాటకు ఈసారి ఉమ వైరల్ స్టెప్పులేసింది. ఈ పాట 2014లో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ హీరోగా వచ్చిన ది షాకీన్స్ అనే సినిమాలోనిది.

ఈ పాట అప్పట్లో తెగ సంచలనాలను క్రియేట్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఉమా మీనాక్షి ఈ పాటను మరోసారి వైరల్ చేసేసింది. అందరూ మర్చిపోయిన ఈ పాటను ఉమ మరోసారి లైమ్‌లైట్‌ లోకి తీసుకొచ్చింది. ఉమ ఇలా వైరల్ స్టెప్పులేసే తెగ పేరును సంపాదించుకుంది.. ఈ డ్యాన్స్ కోసం అమ్మడు హీరోయిన్ కన్నా ఎక్కువగా సెక్సీగా తయారైంది.. తన డ్యాన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చూసే వారి మతిపోయేలా చేసింది. ఈ వీడియోని ఉమ అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందో లేదో అది వెంటనే వైరల్‌గా మారిపోయింది.. లైకులు కామెంట్లతో తెగ ట్రెండ్ అవుతుంది.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

 

 

View this post on Instagram

 

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

Read more RELATED
Recommended to you

Latest news