వావ్.. గాల్లో ఫుడ్ డెలివరీ..ఇంట్రెస్టింగ్..

-

ఇంట్లో ఫుడ్ చేసుకోవడం బరువైన వాళ్ళ కోసం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ఉన్నాయి.రోజుకొక కొత్త సంస్థ ఆన్ లైన్ ఫుడ్ సర్వీసులను అందిస్తున్నారు.. ఇప్పటికే అందుబాటులో జొమాటో, స్విగ్గి వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు రోడ్డు మార్గాల అంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా అహారాన్ని అందించారు.అనుకున్న టైం లో డెలివరీ ఇవ్వకుంటే డబ్బులు సగానికి కట్ అవుతూన్నాయి. అలానే డెలివరీ చేస్తూ వస్తున్నారు. అలాంటి సమస్యల నుంచి బయట పడలాని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి కొత్త ఆలొచనలను చేసింది..

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో తన ప్రాజెక్టు పైలట్ సేవల కోసం నాలుగు డ్రోన్ స్టార్టప్‌లను కంపెనీ షార్ట్‌లిస్ట్ చేసింది. షార్ట్ లిస్టు అయిన కంపెనీలు గరుడ ఏరోస్పేస్, స్కైఎయిర్ మొబిలిటీ, ఏఎన్‌ఆర్ఏ ప్లస్ టెక్ఈగల్ కన్సార్టియా, మారుత్ డ్రోన్‌టెక్‌లున్నాయి. ఇలాంటి డీల్ ద్వారా స్విగ్గీ తన ఇన్‌స్టామార్ట్ కోసం డ్రోన్లను వాడేందుకు పైలట్ సేవలను మే నుంచి ప్రారంభించనుంది. డ్రోన్ కామన్ పాయింట్ వద్దకు స్టాక్‌ను డెలివరీ చేస్తే… వాటిని కామన్ పాయింట్ నుంచి డెలివరీ పార్టనర్లు పికప్ చేసుకుని కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తారని స్విగ్గీ తన పోస్టులో పేర్కొంది.

డార్క్ స్టోర్లు అంటే సెల్లర్ల లొకేషన్ నుంచి కస్టమర్ల అడ్రస్‌కు దగ్గర్లో ఒక కామన్ పాయింట్ వద్దకు గ్రోసరీలను స్విగ్గీ డెలివరీ చేయనుంది. డార్క్ స్టోర్ అనేవి చిన్న ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్. ఈ డ్రోన్ ఆల్ట్రా ఫాస్ట్ డెలివరీల కోసం వాడతారు. డ్రోన్ డెలివరీలపై గరుడ ఏర్ స్పేస్ సీఈవో మాట్లాడుతూ.. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల డ్రోన్ డెలివరీలపై ఫోకస్ పెట్టామని అన్నారు.

ఈ సేవల్లో స్టార్టప్‌ కంపెనీలతో అధునాతనమైన గరుడ ఏరోస్పేస్ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. డెలివరీల సమయాన్ని తగ్గించడం కొరకు ఆకాశమార్గాన్ని ఎంచుకున్నట్లు వెల్లడించారు. గుర్గావ్, చెన్నైలో గరుడ ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్లు ఉన్నాయని ఆయన అన్నారు..వావ్ ఇది వినడానికి కొత్తగా ఉంది కదూ..చుద్దాము.. ప్రస్తుతం ఇలాంటి డెలివరీ తీసుకోవడం కోసం జనాలు ఆసక్తి చూపిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version