వింత ఆచారాలు, వింత సంప్రదాయాల గురించి తెలుసుకోవడం అంటే ఎవరికైనా ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది.. అక్కడ అలా అంట.. ఇక్కడ ఇలా చేస్తారట.. వామ్మో ఎంత విడ్డూరం..అని కబుర్లు చెప్పుకోవడానికి మనకు ఒక కంటెంట్ కావాలి కదా.. మీరు కూడా ఇలాంటి ఇంట్రస్టింగ్ కంటెంట్ కోసం చూస్తుంటే… ఈ వెరైటీ రూల్స్‌పై ఓ లుక్కేయండి. ఈ రూల్స్ చూస్తే..మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఓర్ని ఇలా చేయడం కూడా తప్పైనా అనుకుంటారు..!
అమెరికాలోని మయామి, ఫ్లోరిడాలో జంతువులను అనుకరించడం, వాటిని ఆటపట్టించడానికి వాటి ముఖ కవళికలను కాపీ చేయడం చట్టవిరుద్ధం.
అమెరికా రాష్ట్రం ఓక్లహోమాలో భద్రతా విభాగానికి చెందిన కుక్కలను వేధించడం నేరు. అలా చేస్తే.. మీకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే కుక్కల ముందు వాటిని ఆటపట్టించడానికి ఫన్నీగా ఫేస్ చూపించటం కూడా నేరం.
జర్మనీలో, మీరు ఆటోబాన్ అనే హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు మీ కారులో గ్యాస్ లేదా ఆయిల్ అయిపోయినట్లయితే మీరు మార్గం మధ్యలో కారుని ఆపలేరు. ఇక్కడ ఉన్న చట్టం ప్రకారం అది నేరం. ఇంధనం అయిపోయి మధ్యలోనే ఆగిపోతే జైలు శిక్ష తప్పదు. కారణం ఈ హైవే చాలా వేగంగా ఉండటం. ఇలా మధ్యలో కార్లు ఆగిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఫిజీలో టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేయడం చట్టవిరుద్ధం. ప్రజలు తమ భుజాల వరకు కప్పుకోవాలి.
ఫ్రాన్స్‌లో పందికి నెపోలియన్ అని పేరు పెట్టడం నేరం. అలా చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారట..
జపాన్‌లో వర్షం నీరు రోడ్డుపై పేరుకుపోయి, మీరు మీ కారును బయటకు తీస్తుంటే మీరు వేగం తగ్గించాల్సి ఉంటుంది. మీరు అధిక వేగంతో వెళితే, పక్కన ఉన్న పాదచారులపై నీరు చిమ్మితే, మీరు జైలు శిక్ష అనుభవించవచ్చు. మన దగ్గర ఇలా చాలామంది చేస్తుంటారు. పాపం చాలామంది రోడ్డుపై వెళ్లే వాళ్లు ఇలా ఎప్పుడో ఒకసారి.. ఇబ్బంది పడే ఉంటారు.
సింగపూర్‌లో చూయింగ్ గమ్‌కు సంబంధించి ఓ విచిత్రమైన రూల్ ఉంది. ఇక్కడ చూయింగ్ గమ్ తినడం నిషేధం. ఎందుకంటే ప్రజలు దానిని తిని అక్కడ, ఇక్కడ విసిరేవారు. నగరం మురికిగా మారింది. దీంతో చూయింగ్ గమ్ తినడంపై నిషేధం విధించారు.
ఇంగ్లండ్‌లో చాలా విచిత్రమైన నియమం ఉంది. ఇక్కడ 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు నగ్న బొమ్మలను చూడకూడదు.. . దుకాణాల్లో ప్రదర్శనకు ఉంచిన బట్టలు లేని బొమ్మలను కూడా చూడలేరు. మంచి రూలే.. కాకపోతే.. వయసు ఇంకా పెంచాల్సిందేమో..!
స్విట్జర్లాండ్‌లో ఆదివారం కార్లు కడగడంపై నిషేధం ఉంది. ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉండటం వల్ల కాదు. ఆ ఒక్కరోజులో శబ్ధ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది జరిగింది.
థాయ్‌లాండ్‌లో ఎవరైనా లోదుస్తులు ధరించకుండా ఇల్లు వదిలి వెళితే జైలు శిక్ష విధిస్తారట. ఇక్కడ ఓ డౌట్ ఉంది. లోదుస్తులు ధరించలేదని ఎలా కనిపెడతారు..?
ఇటలీలోని వెనిస్‌లో పావురాలకు ఆహారం ఇవ్వడం నేరం. ఒకటి, రెండు సార్లు చూస్తే వార్నింగ్ ఇచ్చినా ఆ తర్వాత జరిమానా కట్టాల్సిందే. ఓర్ని.. మన దగ్గర ఫోటోలు, వీడియోల పోజుల కోసమైన తెగ వేస్తారు కదా..!