దూసుకుపోతున్న ‘థ్రెడ్స్‌’.. మూడు పోస్టులకే మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించి గిన్సిస్‌ బుక్‌లో స్థానం

-

సోషల్‌ మీడియా అంటేనే పోటీ ప్రపంచం. ఒక యాప్‌కు పోటీగా మరో యాప్‌ వస్తూనే ఉంటుంది. గూగుల్‌కు పోటీగా వచ్చిన చాట్‌ జీపీటి సంచలనం సృష్టించింది. యూజర్లను బాగా యట్రాక్ట్‌ చేసుకుంది. ఇప్పుడు ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన థ్రెడ్స్‌కు అలానే దూసుకుపోతుంది. ట్విటర్‌కు పోటీగా ఇటీవల మెటా లాంచ్ చేసిన మైక్రో బ్లాగింగ్ యాప్ థ్రెడ్స్ (Threads)లో సంచలనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఒక ఫేమస్ యూ ట్యూబర్ థ్రెడ్స్‌లో 10 లక్షల ఫాలోవర్లను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.

20 ఏళ్ల వయస్సే..

అమెరికాలో ఫేమస్ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్ సన్ ఈ రికార్డు సాధించాడు. అతడు మిస్టర్ బీస్ట్‌గా ప్రపంచ వ్యాప్తంగా నెటిజనుల్లో పాపులర్. అతడి వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే. ఫేస్ బుక్, ఇన్ స్టాల యాజమాన్య సంస్థ మెటా తాజాగా లాంచ్ చేసిన థ్రెడ్స్‌లో అతడు 10 లక్షల మంది ఫాలోవర్లను సాధించిన తొలి వ్యక్తి. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌ను సైతం అతడు ఈ విషయలో అధిగమించాడు.

మూడే పోస్టులతో..

థ్రెడ్స్‌లో జాయిన్ అయిన కొన్ని గంటల్లోనే మిస్టర్ బీస్ట్ ఈ ఫీట్‌ను సాధించడం ఇక్కడ హైలెట్‌. అంతేకాదు.. థ్రెడ్స్ లో అతడు పోస్ట్ చేసినవి కేవలం మూడంటే మూడే పోస్టులు. మరికొన్ని గంటల్లోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్లకు చేరింది. దీన్ని బట్టి అతడు ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు. 9,99,999 నుంచి 10 లక్షలకు అతడి ఫాలోవర్ల సంఖ్య మారుతున్న సమయంలో వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

‘ట్విటర్ ను చీట్ చేస్తున్నా’

ఈ రికార్డు సాధించడంపై మిస్టర్ బీస్ట్ స్పందిస్తూ.. ‘నేను ట్విటర్ ను మోసం చేస్తున్నానా?.. ట్విటర్ పోలీస్ కు ఈ విషయం తెలియనివ్వకండి’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇకనైనా తనను ట్విటర్ కు సీఈఓ చేయాలి కదా అని జుకర్ బర్గ్‌ను ట్యాగ్ చేసి మరీ పోస్ట్‌ చేశాడు. ట్విటర్ లో ఆయన ప్రొఫైల్ ఇప్పుడు ట్విటర్ కిల్లర్‌గా మారింది.

యూట్యూబ్‌లో 16.5 కోట్ల ఫాలోవర్లు

జిమ్మీ డోనాల్డ్ సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్‌ యూ ట్యూబ్‌లో కూడా దూసుకెళ్తున్నాడు. అతనికి యూట్యూబ్‌లో 16.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, ట్విటర్‌లో అతడి ఫాలోవర్ల సంఖ్య 2.1 కోట్లు. ఇన్ స్టా లోనూ అతడికి కోట్లలోనే ఫాలోవర్లు ఉన్నారు. థ్రెడ్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ప్రముఖుల్లో ఓప్రా విన్ ఫ్రే, షకీరా, చెఫ్ గోర్డన్ రామ్సే తదితరులు ఉన్నారు. ప్రస్తుతం థ్రెడ్స్ భారత్, యూఎస్, కెనడా, బ్రిటన్, జపాన్ సహా దాదాపు 100 దేశాల్లో యూజర్లకు అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version