అదేలా సాధ్యం రా బాబు.. కాలి వేలికి అన్ని లక్షలా?

-

మనిషికి శరీరం లో అన్ని బాగాలు అవసరం.. ఏ ఒక్కటి పని చెయ్యక పోయిన కూడా లోటు స్పష్టంగా కన్పిస్తుంది..ఎంత డబ్బులు ఇస్తామని చెప్పిన బాడీలోని పార్ట్ లను ఎవ్వరూ అమ్ముకొరు..ఇంక అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప..ప్రపంచంలో ఆకలితో జనాలు చనిపోయే పేద దేశాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశాలలో ప్రముఖంగా వినిపించేది మాత్ర ఆఫ్రికా..కొన్ని దేశాల్లో వలస వ్యాపారం పెరిగింది గానీ, అక్కడి ప్రజల జీవితాలు మరింత దిగజారుతున్నాయి.

 

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి మరికొన్ని రాజ్యాలు. ఈ తరుణంలోనే జింబాబ్వేలో ప్రజలు తమ కాలి వేళ్లను పెద్ద మొత్తంలో డబ్బుకు అమ్ముకుంటున్నారనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.అంతేకాదు..కాలి బొటనవేలు కోసం దక్షిణాఫ్రికాలో సాంప్రదాయ వైద్యులు $40,000 అంటే దాదాపు రూ. 31 లక్షలు ఇస్తున్నటు వాట్సాప్ ప్రచారం ఊపందుకుంది.

ఇక, మధ్య బొటనవేలు కోసం $25,000, చిన్నదానికి $10,000 ఇస్తున్నట్లు వచ్చిన వార్తలను చాలా మంది ప్రజలు నమ్మారు.. ఈ విషయం గురించి ప్రముఖ వార్తా పత్రికలో ప్రచురించారు.మే 28న ప్రచురించబడిన Gambakwe బ్లాగ్, హరారే Ximex మాల్‌లో “కాలి వేళ్ల ట్రేడ్” జరుగుతోందని పేర్కొంది. కొన్ని రోజుల తర్వాత, జింబాబ్వేన్ టాబ్లాయిడ్ H-Metro, మాల్‌లోని బ్లాక్ మార్కెట్ కరెన్సీ వ్యాపారులతో ఒక ఇంటర్వ్యూను పోస్ట్ చేసింది. వారిలో కొందరు దీనిని జోక్ అని చెప్పడంతో ఈ విషయం బయటకు పొక్కింది…చివరికి ఇది నిజం కాదని కూడా వార్తలు వినిపించాయి..కానీ ఆ ప్రభుత్వం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news