భూటియా అడవుల్లో శవాలుగా మారుతున్న చెట్లు..!

-

మనుషుల్లో దెయ్యాలు ఉండటం గురించి మీకు తెలుసు.. కానీ అడవుల్లో దెయ్యాలు ఉంటాయని మీకు తెలుసా..? అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో దెయ్యాల అడవులు ఏర్పడుతున్నాయి. ఇది నమ్మలేని నిజం. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల అనేక నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నట్లే తీరప్రాంత అడవులన్నీ కూడా స్మశాన వాటికలుగా మారుతున్నాయట.. సముద్ర మట్టాలు వేగంగా మూడు రెట్లు పెరగడంతో ఉప్పు నీరు అడవులను ముంచెత్తుతుంది. అడవిలోని పచ్చని చెట్లను ఈ ఉప్పు నీరు చంపేస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఈస్ట్ కోస్ట్‌లో ఇటువంటి దెయ్యాల అడవులు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం 15 అడుగులు పెరుగుతాయట. సముద్రపు ఉప్పునీరు లవణాలు చెట్లలోకి చేరడం వల్లే పచ్చని చెట్లు చనిపోతాయని వర్జీనియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ సైన్స్‌లో పర్యావరణ శాస్త్రవేత్త మాథ్యూ కిర్వాన్ తెలిపారు. చెట్లు చనిపోయిన తరువాత వాటి మొదళ్లు వరుసలలో కనిపిస్తాయి. ఇవి స్మశానవాటికలో సమాధులను పోలి ఉంటాయి.

ప్రస్తుతం విధ్వంసానికి గురవుతున్న వేల ఎకరాల అడవులపై ఎవరూ దృష్టి సారించడం లేదు. దీనికి పరిష్కారం కనిపించడం లేదు. దీనికి తోడు తుఫానులు, సునామీల వల్ల అడవిలోకి ఉప్పునీరు చేరి పచ్చని చెట్లను మృత్యువుగా మారుస్తుంది. పర్యావరణానికి చెట్లు చాలా అవసరం.. కానీ మనం నగరాలకు, పట్టణాల గురించే ఆలోచిస్తున్నాం..కానీ ఇలా పచ్చని చెట్లు శవాలుగా మారుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. దానికి ఏం చేయాలి అనే ఆలోచన కూడా ఎవ్వరూ చెయ్యడం లేదు.

ఉప్పునీటికి సురక్షితమైన దూరంలో చెట్లను పెంచితేనే అడవులు మళ్లీ పుంజుకోగలవని లేకపోతే ఇలాంటి దెయ్యాల అడవులు మన పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతాయని అటవీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చెట్లే మానవ జీవనానికి ఆధారం.. వాటిని ఈరోజు మనం సంరక్షిస్తేనే భవిష్యత్తు తరలా వారు ఆనందంగా బతకగలుగుతారు. ? ఇప్పుడు పెంచే మొక్క రేపటి పచ్చని భవిష్యత్తుకు పునాది. చెట్లను నరికి భవనాలు కడితే ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారు.. మీకు వచ్చే ప్రయోజనం కంటే.. జరిగే నష్టమే ఎక్కువ అని ఆలోచించలేకపోతున్నారని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news