ఆ దేవుడికి నైవేద్యంగా 60 రకాల సిగిరెట్లు, 40 రకాల మద్యం..!

-

దేవుళ్లకు పొంగళ్లు, పొట్టేళ్లు ఇవ్వడం చూశాం.. కానీ నైవేద్యంగా సిగిరెట్లు, మద్యం ఇవ్వడం మీరు ఎక్కడైనా చూశారా..సిగిరెట్లు అంటే నాలుగు ఐదు కాదు.. ఏకంగా 60 రకాల సిగిరెట్లు, 40 రకాల మద్యం సమర్పించాలట..అప్పుడే ఆ దేవుడి కోరిన కోర్కెలు తీరుస్తాడట.. ఇంతకీ ఆ టెంపుల్‌ ఎక్కడ ఉంది.. ఈ వెరైటీ నైవేద్యం స్టోరీ ఎంటో జర చూసేద్దామా..!

మధ్యప్రదేశ్‌లో ఎన్నో అద్భుత దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాలు అత్యంత విశిష్టతను కలిగి ఉంటాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని గురించి అందరికీ తెలుసు.. ఎన్నికల అప్పుడు ఇక్కడికి నాయకులు క్యూకడతారు. ఎన్నో ఆలయాలతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయాలను సందర్శించడంతో పాటు పర్యాటక ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వెరైటీ నేవేద్యం ఇచ్చేది ఇక్కడ కాదు..

ఉజ్జయినిలోని భగ్తిపురలో ఓ ఆలయం ఉంది. షిప్రా నది ఒడ్డున ఉన్న ఈ కాల భైరవ దేవాలయాన్ని రాజు భద్రసేన్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. భైరవ అష్టమి సందర్భంగా ఇక్కడ జరిగే పూజలు అద్భుతంగా, అత్యంత విచిత్రంగానూ ఉంటాయి. భైరవ దేవాలయంలో సాయంత్రం పూట భైరవనాథుడికి మద్యం, సిగరెట్‌లతో సహా 1,351 రకాల భోగ్‌లను సమర్పిస్తారు అక్కడి ఆలయ పూజారులు. కాలభైరవ దేవాలయంలో మద్యాన్ని సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. గత కొన్ని శతాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే పురాతన కాలం నుంచే ఇక్కడ భైరవ అష్టమిని ఘనంగా జరుపుకుంటారు.

ఈ సందర్భంగా భైరవనాథుడిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించి. పూజ అనంతరం భక్తులు స్వామి వారికి మహా భోగ్ అందిస్తారు.. ఇందులో 1,351 రకాల వంటకాలు, 40 రకాల మద్యం, 60 రకాల సిగరెట్లు సహా పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అసలు ఎందుకు ఈ సిగిరెట్‌, మద్యం కాన్సప్ట్‌ ఉందో అక్కడి వారికి కూడా పెద్దగా తెలియదు.. ఏవేవో కట్టుకథలు చలామణిలో ఉన్నాయి. కానీ ఆచారం మాత్రం అనాదిగా వస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news