అప్పుడు 102 భాషల్లో పాటలు.. ఇప్పుడు దేశభక్తి గీతాలు

-

ఆ అమ్మాయి పేరు సుచేతా సతీశ్.. వయసు ప్రస్తుతం 13 ఏళ్లే, రికార్డులు మాత్రం చాలా ఉన్నాయి. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 102 భాషల్లో 102 పాటలు పాడి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. తను పాటలు పాడిన 102 భాషల్లో తన మాతృ భాష మలయాళం, అరబిక్, మైథిలి లాంటి భాషలను వాడింది. గత సంవత్సరం దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌లో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఆమె ఈ రికార్డును క్రియేట్ చేసింది.

ఇప్పుడు మళ్లీ గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్‌లోని అదే భారత కాన్సులేట్‌లో మళ్లీ దేశ భక్తి గీతాలు పాడింది. ఆయె మేరె వాటన్ కె లాగాన్.. అంటూ దేశభక్తి గీతాలను కాన్సులేట్‌లో పాడి అందరిలో దేశభక్తిని నింపింది. ఆమె గణతంత్ర వేడుకల్లో పాడిన వీడియోను ఆల్ ఇండియా రేడియో న్యూస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. గత సంవత్సరం జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సమయంలోనూ వరల్డ్ కప్‌లో పాల్గొన్న టీమ్‌లకు సంబంధించిన భాషల్లో పాటలు పాడింది. ఆ సాంగ్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో అప్పట్లో ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version