స్కూల్‌ దగ్గరకు రా అని పిలిచి.. బాలికపై అఘాయిత్యం..

-

రోజురోజుకు కన్నుమిన్ను కానకుండా కామంధులు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసిన రోజూ అత్యాచార కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా మృగాళ్లు రెచ్చిపోయి తమ కామవాంఛ తీర్చుకోవాడానికి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే ఇది.. 8వ తరగతి బాలికపై ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, కమలాపూర్‌ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పిన ఇదే గ్రామానికి చెందిన పస్తం శ్రీకాంత్‌(22) అనే యువకుడు, రాత్రి సమయంలో ఆమెను పాఠశాల ఆవరణలోకి రమ్మని పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

అర్ధరాత్రి సమయంలో బాధితురాలి తండ్రి కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావటంపై స్పందించిన సీఐ.. అత్యాచారానికి పాల్పడింది ఒక్కడేనని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఇదే ఘటనలో లోతుగా విచారణ చేపట్టేందుకు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత బాలికను, నిందితుడిని హనుమకొండలోని భరోసా కేంద్రానికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం నిందితుడిపై పోక్సో చట్టం, అత్యాచార కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version