నాలుకపై నల్ల మచ్చలు, తెల్ల పుండ్లు ఉన్నాయా..? కారణాలు ఇవే కావొచ్చు..

-

శుభ్రంగా ఉండటం అనేది మనిషికి చాలా అవసరం.. అందంగా ఉండటం వేరు..శుభ్రంగా ఉండటం వేరు. మేకప్‌లు వేసుకుని, పర్ఫ్యూమ్‌లు కొట్టుకుంటే సరిపోదు.. అవేవి లేకున్నా మనిషి శరీరంగా నీట్‌గా ఉండాలి. మాట్లాడుతుంటే.. నోట్లోంచి దుర్వాసన రావడం, బాడీలోంచి చెమట కంపు రావడం మంచిదేనా..? పళ్లు శుభ్రంగా క్లీన్‌ చేసుకుంటే..తెల్లగా ఉంటాయి. బ్రష్‌ చేసుకున్న ప్రతిసారి టంగ్‌ క్లీన్‌ చేసుకోవాలి.. బ్రష్‌కు వెనక పెట్టిచేసుకోవడం కాదు.. నాలుక మీద వివిధ రకాల క్రిములు ఉంటాయి. వాటిని తొలగించకుంటే.. చాలా ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. మీరు గమనించారో లేదో చాలామందికి నాలుక మీద మచ్చలు ఉంటాయి. అవి రావడానికి కారణం ఏంటో తెలుసా..?

నాలుక మీద తెల్ల మచ్చలు..

నాలుక శుభ్రం చేసుకోకపోతే తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దాన్ని నోటి లేదా ఓరల్ థ్రష్ అంటారు. ఇది సాధారణమైనది. సులభంగా చికిత్స కూడా చేసి వీటిని తొలగించుకోవచ్చు.. ఈ సమస్య వచ్చినప్పుడు నోట్లో తరచుగా పుండ్లు పడటం, రుచి తెలియకపోవడం, తినడం, తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. చికిత్స తర్వాత తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలో సమస్య ఉంటే కూడా ఇలా జరుగుతుంది.

నోట్లో కూడా తెల్ల మచ్చలు ఉంటే..

నాలుక మీదే కాకుండా నోరంతా కూడా ఇలా తెల్ల మచ్చలు లేదా పుండ్లు వస్తే ఆ వ్యాధిని ల్యూకోప్లాకియా అంటారు. దీర్ఘకాలం పాటు ధూమపానం చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇవి చాలావరకు నిరాపాయమైనవి. కానీ క్యాన్సర్‌కు ముందు కూడా ఇలా వస్తుంది. అందుకే నోట్లో తెల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి.
నోటిపూతలు
నోట్లో లేదా నాలుకపై పుండ్లు రావడం సర్వసాధరమైన విషయం.. అయితే అందరూ.. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే ఇలా జరుగుతుంది అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే.. కొన్ని రోజుల పాటు ఉండి పోతే సరే.. నోట్లోని పుండ్లు నయం కాకుండా నాలుకపై ముద్దగా అలాగే ఉంటే మాత్రం అది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు. వెంటనే దంత వైద్యులని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
నాలుక మీద గీతలు ఎక్కువగా పడటం..
ఇది సాధారణ పరిస్థితి, తీవ్రమైనది కాదు. సిట్రస్ పండ్లు లేదా స్పైసీ ఫుడ్స్ వంటి కొన్ని ఆహారాల పదార్థాలు అతిగా తీసుకుంటే ఇలా నాలుక మీద గీతల్లా ఏర్పడతాయి.

నాలుక మీద వెంట్రుకలు

నాలుక మీద వెంట్రుకలు ఏంట్రా అనుకుంటున్నారా.. అవును వస్తాయి.. నాలుకపై ఉండే అతి చిన్న చిన్న బుడిపెలపై ఏర్పడే బ్యాక్టీరియా, నోటిలోని వ్యర్థాల కారణంగా నాలుక నల్లగా మారుతుంది. అంతే కాదు నాలుకపై వెంట్రుకలు కూడా మొలుస్తాయి. సాధారణంగా ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కడో ఒకరిద్దరికి ఇలా జరుగుతుంది. వైద్య పరిభాషలో దీన్నే హెయిరీ టంగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. నోట్లో బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలకి ఇది కారణం అవుతుంది. తీవ్రమైన సందర్భాల్లో నాలుక మీద వెంట్రుకలు సాధారణ పొడవు కంటే 15 రెట్లు ఎక్కువగా పెరుగుతాయి. పేలవమైన నోటి పరిశుభ్రత, ధూమపానం వల్ల ఇది సంభవిస్తుంది. నాలుక శుభ్రంగా లేకపోతే ఈ సమస్యలన్నీ వస్తాయి..కాబట్టి.. పళ్లు శుభ్రతతో పాటు నాలుకను కూడా క్లీన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version