బాడీకి కొల్లాజెన్ ఎంతో ముఖ్యమైన కణం.. ఎప్పుడైతే ఇది దెబ్బతింటుందో..ముఖంపై ముడతులు రావడం స్టాట్ అవుతాయి.. ఒక్క ముఖంపైనే కాదు.. శరీరం అంతా.. ఏజ్ పేరికే కొద్ది కొల్లాజెన్ మెష్ దాని పటుత్వాన్ని కోల్పోయి సాగిపోతుంది.. దానివల్ల పెద్దయ్యే కొద్ది ముడుతులు ఏర్పడతాయి.. కానీ మనం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే..40-50 ఏళ్ల వయసులో కూడా ముడతలు లేకుండా ఉండొచ్చు. ఈరోజుల్లో చాలామంది కోరుకునేది అదే.. 30 దాటగానే కళ్ల కింద స్కిన్ లూజ్ అయిపోతుంది.. ఫేస్‌పైనా, మెడ కింద ముడతలు వస్తున్నాయి.ఇవి కనిపించకుండా ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు.. అసలు కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారపదార్థాలను మీరు మీ డైట్‌లో చేర్చుకున్నారంటే..ఈ సమస్యే ఉండదు.. ఐదు కొల్లాజెన్-రిచ్ మూలాధారాలు ఏంటో ఈరోజు చూద్దామా..!
కూరగాయలు
పాలకూర, బ్రోకలీ, తోటకూర, బచ్చలికూర వంటి ఆకు కూరలలో విటమిన్ సి, క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడతాయి.. అంతేకాకుండా వీటిలో యాంటీఆక్సిడెంట్లుకు కూడా సమృద్ధిగా ఉన్నాయి.. బెల్ పెప్పర్స్ (ఎరుపు రకం) విటమిన్ సీ ని అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఇది కొల్లాజెన్ సంశ్లేషణను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఏ కూడా ఉంది. ఇది మీ చర్మం, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పండ్లు..
సిట్రస్ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే…ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. విటమిన్ సి చికాకు కలిగించే చర్మంతో పోరాడుతుంది. కాబట్టి మెరిసే చర్మాన్ని పొందడంలో కూడా సహాయపడుతుంది. టొమాటోలు, ద్రాక్షలు కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. మీరు మీ ఆహారంలో నారింజ, నిమ్మ, ద్రాక్ష, అరటి వంటి పండ్లను చేర్చుకోవచ్చు.
తృణధాన్యాలు
జింక్, రాగితో సహా కొల్లాజెన్-బిల్డింగ్ పోషకాలను కలిగి ఉన్న అధిక-ప్రోటీన్ ఆహారాలు. ఈ పోషకాలు, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలను కొల్లాజెన్‌గా మార్చడంలో సహాయపడతాయి. శుద్ధి చేసిన ధాన్యాల కంటే తృణధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే శుద్ధి చేసిన వాటిలో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఏం ఉండవు.. పాలిష్ చేయడంతోనే ఇవి అన్నీ పోతాయి..ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్ వీట్ మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
చిక్కుడు, బీన్స్
చిక్కుళ్లు, బీన్స్ కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా హెల్ప్ అవుతాయి.. ఇవి అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. అవి విటమిన్ సి, జింక్, కాపర్ వంటి అనేక ఖనిజాలు, పోషకాలను కలిగి ఉంటాయి. మీ ఆహారంలో సోయాబీన్స్, గార్బాంజో బీన్స్, ఫావా బీన్స్ వంటి చిక్కుళ్లు, బీన్స్ చేర్చుకోవచ్చు. అవి సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. మీ కీళ్లకు కూడా ఇవి చాలా మంచివి.
గింజలు..
నట్స్ కూడా మన శరీరాలు స్వయంగా ఉత్పత్తి చేయలేని అమైనో ఆమ్లాలతో పుష్కలంగా నిండి ఉంటాయి. అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.. బాదం, జీడిపప్పు, హాజెల్‌నట్‌లు, వేరుశెనగలు, పిస్తాపప్పులు, వాల్‌నట్‌లు, పొద్దుతిరుగుడు గింజలు, సోయా, బాదం పాలు వంటి మొక్కల ఆధారిత పాలు కూడా మీరు తీసుకోవచ్చు.
వీటితో పాటు నిద్ర కూడా శరీరానికి చాలా అవసరం.. రోజులో కనీసం 6-7 గంట రాత్రి నిద్ర ఉండాలి. అప్పుడే స్కిన్ బాగుంటుంది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్లైతే.. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకునే పడుకోవాలి. రాత్రి లైటింగ్ ఫేస్ మీద వీళ్లకు ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో అలానే పడుకోకూడదంటున్నారు నిపుణులు.