లోకేశ్‌ పాదయాత్ర.. 108 జంటలతో హోమాలు

-

తెలుగుదేశం యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదినాన్ని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. లోకేశ్‌ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలని కాంక్షించారు. ముఖ్యంగా ఆయన ఈ నెల 27 నుంచి చేపట్టబోయే యువగళం పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు కలగకూడదని ఆలయాల్లో పూజలు చేశారు. అయితే.. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని, నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్లో టీడీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 జంటలతో 11 రకాల హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్. రాజు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతంగాని నరసింహ ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు.

అనంతరం శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు దేవినేని
ఉమామహేశ్వరరావు, కె.ఎస్.జవహర్, పీతల సుజాత, పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కైకలూరు ఇంఛార్జి జయమంగళం వెంకటరమణ, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మద్దిపాటి వెంకట్రాజు, కేశినేని చిన్ని, తదితర టీడీపీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో 1000 కిలోల భారీ కేక్ కట్ చేసి నారా లోకేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత శివపార్వతుల కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version