ఈడీ సోదాలు.. జార్ఖండ్ సీఎం సహాయకుడి ఖాతాలో రూ.11.88 కోట్లు

-

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, అతని సహచరులపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. 37 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.11.88 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును సీఎం నియోజకవర్గం సాహిబ్‌గంజ్‌లోని పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ ద్వారా గుర్తించినట్లు అధికారులు ఆరోపించారు. ఈ మేరకు మిత్రాతోపాటు దాహు యాదవ్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు.

cash-seize

ఈడీ అధికారులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో ఐదు స్టోన్ క్రషర్లు, ఐదు తుపాకీ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డిజిటల్ సాక్ష్యాలను సేకరించింది. అక్రమ మైనింగ్ నుంచి రూ.100 కోట్లు సంపాదించినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జార్ఖండ్ మైనింగ్ సెక్రటరీ పూజ సింఘల్ ఉపాధి హామీతో అవకతవకలు పాల్పడ్డారు. రూ.19.76 కోట్లు సీజ్ శారు. పూజ సింఘల్‌తోపాటు సీఏ సుమన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version