ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న 13 మంది అరెస్ట్

-

కుత్బుల్లాపూర్: అక్రమ డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆస్ట్రేలియన్ సిటిజన్స్ డేటాను ఆన్లైన్ లో కనుగొన్న నిందితులు వారి నెంబర్లకు ఫోన్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని పక్కా సమాచారంతో మేడ్చల్ ఎస్ఓటి మరియు పేట్ బషీరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు.

వారి వద్ద నుండి 13 డెస్క్టాప్ మానిటర్స్, 14 సీపీయూలు, 13 హెడ్ ఫోన్లు, ఒక హార్డ్ డిస్క్, ఒక పెన్ డ్రైవ్ , 8సిమ్ కార్డులు ,18 మొబైల్ ఫోన్లు స్వాధీనచేసుకొన్నారు. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు నిందితులను రిమాండుకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డిసిపి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version