తమిళనాడులో దారుణం.. శానిటైజర్‌తో 13 ఏళ్ల బాలుడు మృతి

-

కరోనా వైరస్‌ ప్రజలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి శానిటైజర్‌ వాడకం ఎక్కువైంది. అయితే… తాజాగా…ఈ శానిటైజర్ ఓ పసివాడు ప్రాణాలు తీసింది. ఈ ఘటన తమిళనాడులో రాష్ట్రంలోని తిరుచ్చిలో శనివారం జరిగింది. 13 ఏళ్ళ శ్రీసం అనే బాలుడు… గ్రామస్థులు, ఇంట్లో వారు చేస్తున్న మాదిరిగా వంట చేయాలని శ్రీసం ప్రయత్నించాడు.

ఇందులో భాగంగానే రాళ్లపై కుండ పెట్టి నీళ్ళు అనుకుని… శానిటైజర్ పోశాడు ఆ బాలుడు. కుండకు నిప్పు పెట్టడంతో ఒక్కసారి.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ మంటల్లో పడి మృతి చెందాడు బాలుడు. అల్క్ హాల్‌ తో కూడిన శానిటైజర్ కావడంతో మంటలు భారీగా వ్యాప్తించాయి.

అయితే… సమాచారం అందుకున్న పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శానిటైజర్‌ మంటల వల్లే మృతి చెందాడా ? లేదా ? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు.  అటు శానిటైజర్ ను పిల్లలకు దూరంగా ఉంచాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version