కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద 144 సెక్షన్

-

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ స్కీంపై నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే నేడు అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే.. దీంతో కేంద, రాష్ట్ర పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ నేపథ్యంలో బెజవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు.

కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసు అదనపు బలగాలు మోహరించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో పోలీసులు చేరుకున్నారు. భారత్ బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చిరికలు జారీ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వద్ద కూడా పోలీసు బందోబస్తును పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version