నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో ఏపీలో 3లక్షల ఉద్యోగాలు..

-

ఏపీలోని నిరుద్యోగ యువతకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 3 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని సీఎం జగన్ అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో పెద్ద ఎత్తులో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. త్వరలో విశాఖలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహణ ఉంటుందని సీఎం జగన్‌ వెల్లడించారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, పరిశ్రమలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

CM YS Jagan Mohan Reddy to set stone for Pulivendula model town రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయని సీఎం జగన్‌ చెప్పారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుతో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు సీఎం జగన్‌. ప్రాజెక్టులకు భూములు లీజుకు ఇచ్చిన రైతులకు ఎకరానికి ఏడాదికి 30 వేల రూపాయలు ఇచ్చే విధానం తీసుకువస్తామని సీఎం జగన్‌ చెప్పారు. అంతేకాకుండా రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు సీఎం జగన్‌ ప్రకటించారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news