ముంబైలోని ధారావికి చెందిన ఓ మహిలకు, బీహార్ లోని ఓ 13 ఏళ్ల బాలుడుతో ఫేస్ బుక్ లో పరిచయమైంది. అందులో కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్న తర్వాత, ఇద్దరూ తమ ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. బాలుడి ఫోన్ నంబర్ దొరికిన తర్వాత ఆ మహిళ నిజస్వరూపం బయట పడింది. తన కోరిక తీర్చాలని తరచూ వేధిస్తుండటంతో.. అతడికి మాయమాటలు చెప్పిన ఆ మహిళ తన వద్దకు రప్పించుకుంది.
తీరా వచ్చిన తర్వాత గదిలో బంధించి పలుమార్లు లైంగికదాడి చేసింది. అంతేకాదు.. నగరంలోని చాలా లాడ్జిలు, హోటళ్లకు తిప్పుడూ తన కామ వాంఛ తీర్చుకుంది. చివరికీ ఆ మహిళ ఆగడాలను బాలుడు తన తల్లి దండ్రులకు తెలియజేశాడు. వారు తమ పిల్లాడిని రక్షించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే.. బాలుడితో పాటు అతడి తండ్రి, మేన మామ తనపై లైంగిక దాడి చేశారని ఆమె పోలీసు కేసు పెట్టడం కొసమెరుపు. చివరికీ ఫోన్ చాటింగ్ పరిశీలించిన తర్వాత సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు.