సూపర్ స్కీమ్..రూ.5 వేలు డిపాజిట్ చేస్తే.. రూ.42 లక్షలు..!

-

ఈరోజుల్లో చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. ఇలా డబ్బులని పెట్టడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కూడా రాదు. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. డబ్బు పెట్టుబడి పెట్టేది మంచి రాబడి కోసమే. అయితే పథకాన్ని బట్టి లాభాలు ఉంటాయి. మంచి రాబడి ని పొందాలని అనుకునే వాళ్ళు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లో డబ్బులని పెట్టుకోవచ్చు. పీపీఎఫ్ నుంచి మంచి రాబడి వస్తుంది. ఈరోజుల్లో ఈ స్కీమ్ లో చాలా మంది డబ్బులని పెడుతున్నారు.

ఈ రోజుల్లో ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టె వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ప్రభుత్వ హామీతో పాటు మీ డబ్బు కూడా భద్రంగా ఉంటాయి. PPF స్కీమ్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటే ఈ స్కీమ్ తాలూకా పూర్తి వివరాలు చూసేద్దాం. రూ.5వేల డిపాజిట్‌తో 42 లక్షల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా పొందేందుకు అవుతుంది.

ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టి లాంగ్ టర్మ్‌ లో మంచి లాభాలు పొందవచ్చు. ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి దీనిలో పెట్టచ్చు. కాంపౌండ్ వడ్డీ లభిస్తుంది. ఇది రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్. దగ్గరలోని పోస్టాఫీసు లేదా ఏదైనా నేషనల్ బ్యాంక్‌లో ఈ స్కీమ్ ని మీరు ఓపెన్ చెయ్యవచ్చు. కనీసం రూ.500తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. 2023 2023 జనవరి 1 నుంచి ప్రభుత్వం ఈ స్కీము యొక్క వడ్డీ రేటును 7.1 శాతానికి పెంచింది. PPF స్కీమ్ మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. ఐదేళ్లకు ఒకసారి చొప్పున రెండు విడతల్లో పది సంవత్సరాలు ఈ స్కీమ్ గడువుని పొడిగించుకోవచ్చు.

కాంట్రిబ్యూషన్ పొడిగించుకోవడం ఆప్షనల్. పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జమ్షన్ బెనిఫిట్ కూడా వుంది. ఈ స్కీము కింద ప్రతి నెలా 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో మీ పెట్టుబడి రూ.60,000 అవుతుంది. ఈ స్కీమ్ లో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ నాటికి రూ.16,27,284 అవుతుంది. మెచ్యూరిటీని ఐదేళ్ల బ్లాక్ పీరియడ్‌తో రెండుసార్లు పెంచుకోవచ్చు. పదేళ్లకు డిపాజిట్స్ పొడిగిస్తే 25 సంవత్సరాల తర్వాత రూ.41,57,566 అవుతుంది. మీ డిపాజిట్ కాంట్రిబ్యూషన్ రూ.15,12,500 కాగా వడ్డీ ఆదాయం రూ.26,45,066కు చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version