తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 53 కరోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో నేడు క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గాయి. సోమ‌వారం నాటితో పోలిస్తే.. ఈ రోజు క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గాయి. కాగ ఈ రోజు కరోనా వైర‌స్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 53 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు మాత్ర‌మే వెలుగు చూశాయి. కాగ సోమ వారం రాష్ట్రంలో 73 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

అంటే.. నిన్న‌టితో పోలిస్తే.., నేడు దాదాపు 20 కేసులు తగ్గాయి. కాగ ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ నెల రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు వెలుగు చూడ‌టం లేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో 77 మంది క‌రోనా వైర‌స్ బాధితులు క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం.. 615 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 19,681 క‌రోనా నిర్ధార‌ణ పరీక్షల‌ను చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version