540 అసిస్టెంట్ SI హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్‌స్పెక్టర్ , హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 540 ఖాళీలను ఈ రిక్రూమెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలను చూస్తే.. 122 ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్), 418 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఖాళీలు వున్నాయి. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.

దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 25 వరకు సమయం వుంది. ఈలోగా అప్లై చేసుకోవచ్చు. ఇక అర్హత వివరాలను చూస్తే 12వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. స్టెనో టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి. వయస్సు వివరాలను చూస్తే.. 18 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే.. అర్హత వున్న వాళ్లు www.cisfrectt.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version