అనకాపల్లి జిల్లాలో ఘోరం.. 7గురు విద్యార్థులు గల్లంతు..

-

అనకాపల్లి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అచ్యుతాపురం మండలం సీతాపాలెం పూడిమడక బీచ్ లో స్నానానికి దిగిన ఏఢుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో నర్సీపట్నంకు చెందిన పవన్ అనే విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి తేజను స్థానిక మత్స్యకారులు రక్షించారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. శుక్రవారం అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు సీతాపాలెం బీచ్ కు వచ్చారు. వీరిలో ఏడుగురు సముద్రంలో దిగారు. మిగిలిన విద్యార్థులు ఒడ్డునే ఉన్నారు. ఈ క్రమంలో ఓ పెద్ద అల రావడంతో ఏడుగురు విద్యార్థులు సముద్రంలో మునిగిపోయారు. వెంటనే మత్స్యకారులు స్పందించడంతో ఒకర్ని కాపాడారు. గల్లంతయిన వారిలో గోపాలపట్నంకు చెందిన జగదీష్, నర్సీపట్నంకు చెందిన జశ్వంత్, చూచుకొండకు చెందిన గణేష్, యలమంచిలికి చెందిన చందూ, గుంటూరుకు చెందిన సతీష్ ఉన్నారు.

విద్యార్థుల కోసం స్థానిక పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. కాలేజీలో పరీక్ష రాసిన అనంతరం ఫ్రెండ్స్ అందరూ కలిసి బీచ్ కు వెళ్లారు. సరదాగా స్నానం చేస్తుండగా ఈ ఘోరం జరిగింది. కళ్లముందే స్నేహితులు గల్లంతుకావడంతో విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు బీచ్ వద్దకు చేరుకున్నారు. ఘటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఒడ్డుకు చేరిన విద్యార్థులకు అవసరమైన వైద్యం అందించాలని అధికారలకు సూచించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఎస్పీ ద్వారా కోస్ట్ గార్డ్ ను కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version