భారతదేశంలో.. డయబెటీస్, బీపీ రోగులు ఎక్కువ.. ప్రతి పదిమందిలో నలుగురు వీటిలో ఏదో ఒకదానితో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు అధ్యయనం ద్వారా కనిపెట్టారు. ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్’ అనే రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఇండియాలో అధిక రక్తపోటు ఉన్న రోగులలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మంది రక్తపోటు నియంత్రణలో ఉంచుకున్నారు. ఇది అకాల మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, న్యూ ఢిల్లీ, అమెరికాకు చెందిన ‘బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ పరిశోధకులు 2001 తర్వాత ప్రచురించబడిన 51 అధ్యయనాలను వివరంగా సమీక్షించారు. దీని ఆధారంగా భారతదేశంలో అధిక రక్తపోటు నియంత్రణ రేట్లు కనుగొనబడ్డాయి.
21 అధ్యయనాలలో (41 శాతం), స్త్రీలతో పోలిస్తే పురుషులలో అధిక రక్తపోటు నియంత్రణలో అధ్వాన్నంగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఆరు అధ్యయనాలు (12 శాతం) గ్రామీణ రోగులలో అధ్వాన్నమైన నియంత్రణ రేట్లను గుర్తించారు.
భారతదేశంలో అధిక రక్తపోటు ఉన్న రోగులలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మంది 2016-2020లో వారి రక్తపోటు నియంత్రణలో ఉంచుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నియంత్రణ రేటు మెరుగుపడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. హృద్రోగుల మరణాల సంఖ్యను తగ్గించడంలో రక్తపోటు మెరుగైన నియంత్రణ రేటును సాధించడం చాలా ముఖ్యమని పరిశోధకులు అంటున్నారు. కారణం భారతదేశంలో మరణాలకు ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు ఒకటి.
హృద్రోగుల మరణాల సంఖ్యను తగ్గించడంలో రక్తపోటు మెరుగైన నియంత్రణ రేటును సాధించడం చాలా ముఖ్యమని పరిశోధకులు అంటున్నారు. కారణం భారతదేశంలో మరణాలకు ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు ఒకటి. రోగాలు రాకముందే జాగ్రత్త పడాలి.. కానీ ఒకసారి అవి వచ్చాక..ఇంకా జాగ్రత్త పెరగాలి..ముందులా ఉంటే ప్రమాదం తప్పదు. లైఫ్‌లో ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఇంకోటి ఉండదు.. ఎన్ని చేసినా ఏం చేసినా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం కోసమే అని గుర్తుపెట్టుకోవాలి.. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఏం చేసినా ఆనందం కూడా దూరమవుతుంది..!