కాంగ్రెస్‌లో ’78’ కథ..క్లారిటీ ఉందా?

-

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగానే కష్టపడుతుంది…తమకు అందివచ్చిన ప్రతి అవసకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ…అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టుకుంటూ బీజేపీ నేతలు ముందుకెళుతున్నారు. ఇటు మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది…ప్రతిపక్షాలకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వకుండా సత్తా చాటాలని చూస్తుంది. అయితే ఈ రెండు పార్టీల వర్షన్ ఇలా ఉంటే..కాంగ్రెస్ పార్టీ వర్షన్ మరోలా ఉంది.

అసలు ఆ పార్టీలోనే రచ్చ ఎప్పుడు సద్దుమనుగుతుందో అర్ధం కాకుండా ఉంది. ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టడం పక్కన పెడితే…కాంగ్రెస్ నేతలే ప్రత్యర్ధులుగా మారి ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు చూస్తున్నారు. ముందు మునుగోడు ఉపఎన్నిక ఉన్నా సరే కాంగ్రెస్ వైఖరిలో మార్పు లేదు. కాకపోతే పార్టీలో ఎన్ని సమస్యలు ఉన్న పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం…పార్టీని గెలిపించడానికి కష్టపడుతున్నారు..అటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సైతం రేవంత్ రెడ్డికి మద్ధతుగానే ఉంటున్నారు.

ఇదే క్రమంలో తెలంగాణపై ప్రియాంక గాంధీ సైతం ఫోకస్ పెట్టారు…ఇకపై రాష్ట్ర వ్యవహారాలని ఆమె చూసుకొనున్నారు. అలాగే పార్టీలోని సమస్యలు సద్దుమణిగేలా చేసేలా ఉన్నారు. అయితే ఇదే విషయాన్ని మాణిక్యం సైతం చెబుతున్నారు..అలాగే మునుగోడు అభ్యర్ధి ఎంపిక విషయంలో స్పీడ్ గా ఉన్నారు. పాల్వాయి స్రవంతిని దాదాపు ఫిక్స్ చేసినట్లే తెలుస్తోంది. అలాగే మునుగోడులో తమదే గెలుపు అని అంటున్నారు.

అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పారు..రేవంత్ కూడా 78 సీట్లు గెలుస్తామని గతంలో మాట్లాడారు. అయితే ఎక్కడైనా ఒక రౌండ్ ఫిగర్ చెబుతారు..అంటే 70 లేదా 80 అని…అది కాదు అనుకుంటే 75 చెబుతారు. మరి మాణిక్యం మాత్రం 78 సీట్లు అంటున్నారు..మరి ఇందులో ఏం లాజిక్ ఉందో అర్ధం కాకుండా ఉంది. అంటే 78 సీట్లలో కాంగ్రెస్ గెలుపుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారా? అనేది తెలియడం లేదు. చూడాలి మరి మాణిక్యం చెప్పినట్లు…కాంగ్రెస్ 78 సీట్లు గెలుస్తుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news