తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు రోజుల పాటు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ నడిచింది.దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ స్టిక్కర్స్ అంటించారు. ఈ క్రమంలోనే వారికి ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు.
కులగణనకు ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. ఆస్తి వివరాలు, రుణాలు, శాలరీ, ఫ్యామిలీ ఇన్‌కమ్, ల్యాండ్, బ్యాంకింగ్ వివరాలు, రాజకీయ నేపథ్యం గురించి చెప్పేందుకు ప్రజలు నో చెబుతున్నారని టాక్. ఇలా 100కు పైగా ప్రశ్నలు ఉండడంతో ప్రజలు సహకరించడం లేదని తెలుస్తోంది.
మా వ్యక్తిగత వివరాలు మీకు ఎందుకు చెప్పాలంటూ నిలదీయడంతో పాటు గతంలో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయి? ఆరు గ్యారంటీలు ఎందుకు ఇవ్వట్లేదు? అంటూ సిబ్బందిని నిలదీస్తున్నారని అని తెలిసింది. అంతేకాకుండా, ఇంటి ముందు సర్వే కోసం స్టిక్కర్లు పెట్టడానికి కూడా జనాలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.