తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. మాస్క్ ధరించకపోతే రూ.1000 ఫైన్..

-

ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం లో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనన్నారు. వ్యాక్సిన్ కంటే అత్యంత రక్షణ కవచం మాస్క్… ఖచ్చితంగా ధరించాలని డీహెచ్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మూడు రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు వ్యాప్తి చెందిందని.. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తుందన్నారు. ప్రజల చెంతకు వ్యాక్సిన్లు వస్తున్నాయి… సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 5.90 లక్షలు హైదరాబాద్ లో, 4.80 లక్షలు మేడ్చల్ లో, 4.10 లక్షల మంది రంగారెడ్డిలో రెండో డోస్ వేసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉంది… వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లేనని హెచ్చిరిం చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version