భర్తపై కోపంతో భార్య దారుణం.. 250 వీడియోలు తీసి మరీ !

-

చెన్నై : తమిళనాడులో రెండేళ్ళ బిడ్డను కర్కషంగా కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. కన్న బిడ్డను రక రకాలుగా కొట్టి చిత్రహింసలు పెట్టింది తల్లి తులసీ. ప్రస్తుతం ఆ రెండేళ్ళ ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రదీప్‌ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని విల్లిపురం జిల్లా లోని సత్య మంగళం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్.. చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని పెళ్ళి చేసుకున్నాడు.

వారికి గోకుల్ (4) ప్రదీప్ (2) అనే పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఈ భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు వస్తుండేవి. ఈ నేపథ్యం లో ప్రదీప్‌ ను తరచు కొట్టేది తులసి. అంతేకాదు బిడ్డను కొడుతున్న దృశ్యాలు సెల్‌ ఫోన్‌ లో చిత్రీకరించి భర్తకు పంపింది తులసి.

దాదాపు ఆ చిన్నారిని కొట్టిన 250 వీడియోలు భర్తలకు పంపింది. ప్రస్తుతం బాబు ఆస్పత్రిలో ఉన్నారు. ఇటు తులసి పరారీలో ఉంది. ప్రియుడు పై మోజుతోనే భార్య తులసి ఇలా చేసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వడివేలు ఫిర్యాదు తో తల్లి తులసి కోసం… ప్రత్యేకంగా పోలీసు టింలను చిత్తూరుకు పంపింది స్టాలిన్ సర్కారు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version