సికింద్రాబాద్ లోని నల్లగుట్టలో ఘోర అగ్నిప్రమాదం

-

సికింద్రాబాద్ పరిధి నల్లగుట్ట లోని ఓ షాపింగ్ మాల్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాపింగ్ మాల్ మొత్తానికి విస్తరించడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు చెడరేగడంతో ఆరుగురు వ్యక్తులు భవనం పై అంతస్తులో చిక్కుకున్నారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్తలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్ అధికారులు క్రేన్ సహాయంతో పై అంతస్తులు చిక్కుకున్న వారిని రక్షించారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భవనం పక్కన ఉన్న నివాసాలకు పొగలు వ్యాప్తి చెందడంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version