ఆమ్ ఆద్మీ పార్టీ తన పార్టీ తరుపున రాజ్యసభకు పంజాబ్ నుంచి ముగ్గురిని నామినేట్ చేసింది. అందరూ మొదటి నుంచి అనుకున్నట్లే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. హర్భజన్ సింగ్ తో పాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ప్రొఫెసర్ డా. సందీప్ పతాక్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో పంజాబ్ నుంచి 5 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవనుండగా… నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
పంజాబ్ విజయంతో ఆప్ ఫుల్ జోష్ లో ఉంది. పంజాబ్ నుంచి హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు నామినేట్ చేయడం బిగ్ మూవ్ గా అనుకుంటున్నారు. ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. 117 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. ఏకంగా 92 స్థానాలను గెలుచుకుంది. ఇటీవల ఆపార్టీ తరుపున భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.