బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ కు సంబంధించిన ఒక వార్త తాజాగా సంచలనంగా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినీ హీరోగా ఉన్న అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకు ముందు సినీ నటులుగా ప్రజల అభిమానాన్ని పొందిన చాలా మంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే కొందరు ఫెయిల్యూర్ కూడా అయ్యారు, ఇక అమితాబ్ బచ్చన్ సైతం 1984 లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు తనయుడు కూడా తండ్రి బాటలోనే నడవనున్నారని వార్తలు. ఈయన కూడా యూపీలోని అలహాబాద్ స్థానం నుండి సమాజావాదీ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.