హైదరాబాద్ లోని ప్రొ. జయశంకర్ యూనివర్సిటీలో ఏబీవీపీ మహిళా కార్యకర్త జుట్టు పట్టుకున్న మహిళా కానిస్టేబుల్ పైన చర్య తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేసినా సంగతి తెలిసిందే. గవర్నర్‌ను కలిసినవారిలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీలు శ్రీనాథ్, పృథ్వీరాజ్, కల్యాణి తదితరులున్నారు.ఈ మేరకు మహిళా కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది.
వర్సిటీలో హైకోర్టు భవనం వద్దంటూ ఇటీవల ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఓ మహిళా కార్యకర్తను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆమె జట్టు పట్టుకోగా ఆ అమ్మాయి కిందపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.