హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జం లేదని ప్రకటించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. నిమర్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని… మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు …ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని వివరించారు. హై కోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జం లేదని… కానీ ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు లో నిమర్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.
రాబోయే రోజుల్లో మరో 8వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఇదే సమయంలో ములాధుమ్ నబీ ప్రోగ్రామ్ ఉంది మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. 17న పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమం, పెరేడ్ గ్రౌండ్లో మరో కార్యక్రమం ఉందన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.