ఏసర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని స్మార్ట్ డివైజ్ లు సక్సెస్ టాక్ ను అందుకున్నాయి.మార్కెట్లోకి వివిధ రకాల ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన సంస్థ ఇప్పటికే ఫేమస్ అయింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు స్మార్ట్ టీవీల తయారీపై దృష్టి సారించింది. ఏసర్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి నాలుగు 4K ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. Acer I-సిరీస్ టీవీలు 32, 43, 50, 55 అంగుళాల వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. ఇవన్నీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి.
భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లను అందిస్తాయి. కొత్త ఏసర్ ఐ-సిరీస్ లైనప్ ధరలు రూ. 14,999 నుంచి ప్రారంభమవుతాయి. తాజాగా లాంచ్ అయిన డివైజ్‌లలో హై ఎండ్ వేరియంట్ ధర రూ.38వేల వరకు ఉంది. టీవీ సైజును బట్టి ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మారుతున్నాయి…ఫ్రేమ్‌లెస్ డిజైన్, ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. HDR 10+ సపోర్ట్‌తో టీవీ క్వాలిటీ ఇమేజ్‌ను అందిస్తుంది. సూపర్ బ్రైట్‌నెస్, 4K అప్‌స్కేలింగ్, ఇతర ఇన్‌బిల్ట్ ఫీచర్‌లతో ఇవి బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఏసర్ TVలు 1 బిలియన్ కంటే ఎక్కువ కలర్స్ డిస్‌ప్లే చేయగలవు.
కంటి రక్షణ కోసం బ్లూ లైట్ రిడక్షన్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి.
డాల్బీ ఆడియో సపోర్ట్‌తో పాటు డ్యుయల్ Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఓటిటి లోని అన్ని యాప్ లను కలిగి ఉంది.32-అంగుళాల ఏసర్ ఆండ్రాయిడ్ TV ధర రూ. 14,999. 43 అంగుళాల మోడల్ రూ. 27,999, 50 అంగుళాల మోడల్ రూ. 32,999, 55- అంగుళాల టీవీ రూ. 37,999 కి లభిస్తున్నాయి..ఇవి అన్ని ఆన్‌లైన్ స్టోర్ లలో లభిస్తున్నాయి..