మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ పై అద్దంకి దయాకర్ సీరియస్

-

రేవంత్‌ రెడ్డిపై నిన్న మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై వీడియో విడుదల చేశారు అద్దంకి దయాకర్. మీ లాంటి పెద్దలు పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడటం తగదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడిన మాటలపై పొరపాటు జరిగిందని చెప్పానని..అంతర్గత అంశాలపై సెట్ చేసే బాధ్యత మీరే తీసుకోండని కోరారు.

మిమ్మల్ని ఎవరు కాదనరని.. టీఆర్‌ఎస్‌..బీజేపీ లు కలిసి కాంగ్రెస్ నీ లక్ష్యంగా కుట్రలు చేస్తుందని ఫైర్‌ అయ్యారు. వీటిపై కొట్లాడాల్సిన మనం… అంతర్గత అంశాలపై మాట్లాడుకోవడం పై కార్యకర్తలు అసంతృప్తి తో ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌..బీజేపీ కుట్రలతో కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బందుల్లో ఉందని తెలిపారు.

నేను చేసిన కామెంట్స్ కి నేనే బాధ్యున్ని అని.. రేవంత్ రెడ్డి అనిపించారనేది అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ఎవరో చెప్తే నేను మాట్లాడనని.. అన్ని అంశాలు ఏఐసీసీ పరిశీలిస్తుందని వెల్లడించారు. మీరంటే గౌరవమని..పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టెలా చేయకండని అద్దెంకి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news