రాజగోపాల్ పార్టీ వీడటం బాధాకరం..నష్టమే : అద్దంకి దయాకర్‌

-

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నట్లు.. అంతేకాకుండా కాంగ్రెస్‌కు తెలంగానలో ఉనికి లేదంటూ వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. అయితే.. తాజాగా.. పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. మునుగోడులో ఎన్నికలు రాజగోపాల్ వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చిందన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ కి వెళ్లి గెలిస్తే వచ్చే లాభం ఏంటి..? అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. చికోటీ కేసులో 16 మంది ఎమ్మెల్యే లు ఉన్నారని, బీజేపీ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని మండిపడ్డారు అద్దంకి దయాకర్. టీఆర్‌ఎస్‌, బీజేపీ బ్లాక్ మెయిల్ లో ఉన్నదని, అందుకే బీజేపీ … కాంగ్రెస్ నీ టార్గెట్ చేస్తుందన్నారు అద్దంకి దయాకర్.

రాజగోపాల్ పార్టీ వీడటం బాధాకరం..నష్టమేనని, ఈటెల రాజేందర్…అస్తిత్వం కాపాడుకొనే పనిలో పడ్డారన్నారు. సహజ గుణం ఈటెల కోల్పోయాడని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులకు కాంగ్రెస్ నేతలే
దిక్కు అయ్యారని, తెలుగు రాష్ట్రాల్లో మోడీ ముఖమే నెగిటివ్ అయ్యిందని, ఈటెల, రాజగోపాల్ వ్యాపార బానిసలు అన్నారు అద్దండి దయాకర్‌. ఈటెల … కాంగ్రెస్ లో చేరడానికి రాలేదా..? అని ప్రశ్నించారు. బీజేపీకి, టీఆర్‌ఎస్‌కి రేవంత్ టార్గెట్ అయ్యాడని, రేవంత్ తో పార్టీ బలపడుతుంది అని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు అద్దంకి దయాకర్‌. సోనియా గాంధీ నియమించిన వ్యక్తే కదా రేవంత్ అని ప్రశ్నించన అద్దంకి దయాకర్‌.. ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదు మీరు అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version