హెస్ట్ గా అలరించనున్న విక్టరీ వెంకటేష్..!

-

సీనియర్ హీరోలు ఓటీటీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఓటీటీల్లో టాక్ షోలకు హెస్ట్ లుగా మారుతున్న ట్రెండ్ ను మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ సందడి చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకు హెస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో భారీ సక్సెస్ సాధిాంచింది. ఇండియాలో బెస్ట్ టాప్ 10 టాక్ షోలలో ఒకటిగా నిలిచింది. మోహన్ బాబు, బన్నీ, రానా, రాజమౌళి, శ్రీకాంత్, కీరవాణి, సుకుమార్, రవితేజ వంటి స్టార్లు ‘అన్స్టాపబుల్’కి గెస్ట్ లుగా వచ్చారు. వీరందరితో బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. బాలయ్య ఎనర్జీ లెవల్స్ ఈ షోలో  హైలెట్ అనిచెప్పాలి.

ఇదిలా ఉంటే తాజాగా విక్టరీ వెంకటేష్ హెస్ట్ గా మరో షోకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆహా కోసం వెంకటేష్ హెస్ట్ గా ఓ స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ తో అదరగొడుతుంటే… వెంకీ మామా చేసే ప్రోగ్రాాం ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news