గూగుల్ కు రాజీనామా చేసిన “AI గాడ్ ఫాదర్” !

-

ప్రపంచంలో రోజు రోజుకూ ఏదైనా అభివృద్ధి చెందుతూ ఉందంటే అది ఒక్క టెక్నాలజీ మాత్రమే అని చెప్పాలి. నేటి రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా డిమాండ్ ఏర్పడుతుందో చూస్తున్నాము. అయితే కొందరు మాత్రం ఈ ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్ వలన ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇటువంటి సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు గాడ్ ఫాదర్ అయినటువంటి జెఫ్రీ హింటన్ దీనిని వ్యతిరేకించే వారిలో చేరాడు. హింటన్ AI సిస్టమ్స్ కు ఫౌండేషన్ టెక్నాలజీ ని క్రియేట్ చేశాడు, ఈయన ఈ మధ్యనే గూగుల్ సంస్థ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించి ఎందరికో షాక్ ఇచ్చాడు.

అయితే తాను ఏదైతే సృష్టించాడో ? దాని వలన భవిష్యత్తులో మానవాళికి మరియు సమాజానికి జరగనున్న ప్రమాదం గురించి అందరికీ తెలియచెప్పాడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మరి ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వర్గాలకు పెద్ద షాక్ అని చెప్పాలి. మరి ముందు ముందు AI ఎంతలా మనతో మమేకం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version