కాగా కరోనా రెండో వేవ్ వ్యాప్తి తీవ్రమైంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రులకు కరోనా రోగుల సంఖ్య ఎప్పుడు లేనంతగా పెరిగాయి. మరోవైపు ఆక్సిజన్ లేకపోవడంతో మృతులు విపరీతంగా పెరుగుతున్నారు. సెకండ్ వేవ్ తీవ్రత ఇలా ఉందంటే.. మూడో వేవ్ ఇంకెంత భయంకరంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. వ్యాక్సిన్ పంపణీని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇప్పటికే 45 ఏళ్లు దాటిన వాళ్లకు టీకా ఇస్తున్నారు. 18 ఏళ్ల దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.