పిబ్రవరి వద్దనుకొని , సమ్మర్ కే వస్తున్న అఖిల్ అక్కినేని.!

-

హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్  ను ఖచ్చితం గా సంక్రాతికి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నంలో వారికి దారుణ మైన దెబ్బలు తగులతాయి అని విరమించుకున్నారు.

కాని ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ తడిసి మోపెడు అయ్యింది. సంక్రాంతి పండుగకు చిరంజీవి , బాలయ్య బాబు పందెం కోళ్ల లాగా తలపడుతున్నారు. ఇవికాక విజయ్, అజిత్ సినిమాలు కూడా ఉన్నాయి, ఇన్ని సినిమాలు, ఇంత మంది  హీరోలు బరిలో నిలిస్తే , తమ సినిమాకు దెబ్బ పడటం ఖాయం అని ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

సాదారణంగా పెద్ద హీరోల తెలుగు సినిమాలు ఫిబ్రవరి మరియు మార్చి లో విడుదల చేయటానికి ఆసక్తి చూపరు. ఆ రెండు నెలలు  పరీక్షలు ముందు వస్తాయి కాబట్టి అందుకే పెద్ద సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదల  కావు. అది పెద్ద రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అందుకే వడ్డీలు, బడ్జెట్ పెరుగుతున్నా కూడా ఇప్పుడు వద్దు అని మళ్లీ సమ్మర్ కే ప్లాన్ చేశారు.ఇటీవల జరిగిన నైట్ షూట్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.ఇటీవలే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. విడియో లో  అఖిల్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version