హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను ఖచ్చితం గా సంక్రాతికి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నంలో వారికి దారుణ మైన దెబ్బలు తగులతాయి అని విరమించుకున్నారు.
కాని ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ తడిసి మోపెడు అయ్యింది. సంక్రాంతి పండుగకు చిరంజీవి , బాలయ్య బాబు పందెం కోళ్ల లాగా తలపడుతున్నారు. ఇవికాక విజయ్, అజిత్ సినిమాలు కూడా ఉన్నాయి, ఇన్ని సినిమాలు, ఇంత మంది హీరోలు బరిలో నిలిస్తే , తమ సినిమాకు దెబ్బ పడటం ఖాయం అని ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
సాదారణంగా పెద్ద హీరోల తెలుగు సినిమాలు ఫిబ్రవరి మరియు మార్చి లో విడుదల చేయటానికి ఆసక్తి చూపరు. ఆ రెండు నెలలు పరీక్షలు ముందు వస్తాయి కాబట్టి అందుకే పెద్ద సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదల కావు. అది పెద్ద రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయినా ఇప్పటికే బడ్జెట్ పెరిగి వడ్డీలు కట్టలేక కచ్ఛితంగా అప్పుడే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట. చూడాలి మరి ఈ యంగ్ హీరో అదృష్టం ఎలా ఉందో..