ఢిల్లీ మరియు గుజరాత్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వార్నర్ సేన నిర్ణీత ఓవర్ లలో 162 పరుగులు చేసి గుజరాత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ను నిలిపింది. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్ ఆశించిన రీతిలో కొనసాగలేదు అని చెప్పాలి. గుజరాత్ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కొల్పోయి ఒక దశలో కనీసం 150 పరుగులు అయినా సాధిస్తుందా అనిపించింది. కానీ ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లిటిల్ కేమియో 22 బంతుల్లో 2 ఫోర్లు మరియు 3 సిక్సుల సహాయంతో 36 విలువైన పరుగులు సాధించి గుజరాత్ ముందు ఆ మాత్రం టార్గెట్ ను నిలుపడంలో సహాయపడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ లో వార్నర్ 37, పృథ్వి షా 7, మార్ష్ 4, సర్ఫరాజ్ 30, రాసౌ 0, పారెల్ 20, హకిం 8 మరియు కుల్దిప్ యాదవ్ 1 పరుగులు చేశారు.
ఒక ఢిల్లీ ఇన్నింగ్స్ ను కకావికలం చేసిన షమీ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు మరియు జోసెఫ్ 2 వికెట్లు తీసుకున్నారు. మరి ఢిల్లీ ముందు ఉంచిన 163 పరుగుల టార్గెట్ ను గుజరాత్ చేదిస్తుందా చూడాలి.