వాహనదారులకు కేంద్రం ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలు మారనున్నాయి. అతివేగంతో ఎవరైనా వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000 వరకు చలాని విధించనున్నారు.
అదేవిధంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే రూ.25 వేల జరిమానా విధిస్తారు. అలాగే 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్‌కు వారిని అనర్హులు. వాహనం ఇచ్చిన యజమాని రిజిస్ట్రేషన్ కార్డు ని కూడా రద్దు చేస్తారు. నూతన డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల మేరకు ఇకపై ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. ఆర్టీవో కేంద్రాలకు బదులుగా ప్రైవేటు ట్రైనింగ్ సెంటర్లు డ్రైవింగ్ టెస్టులను పెట్టి సర్టిఫికెట్లను జారీ చేసేందుకు అవకాశం కల్పించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందకు గాను 9 లక్షల పాత ప్రభుత్వ వాహనాలను తొలగించనున్నారు.