Alia Bhatt : ఎల్లోరా శిల్పాన్ని తలపిస్తున్న ఆలియా అందాలు

-

ఆలియా భట్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. బాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుని తన సినిమాలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. తాజాగా ఆలియా చీరకట్టులో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్ఎంఏసీసీ లాంచ్​కు ఈ ఔట్​ఫిట్​లో హాజరైంది. చీరలో ఆలియా చాలా అందంగా కనిపిస్తోంది. హాఫ్ షోల్డర్ బ్లౌజ్​లో తన అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేసింది.

ట్రెడిషనల్ ఔట్​ఫిట్ అయిన శారీలోనూ ఆలియా చాలా ట్రెండీగా కనిపిస్తోంది. మెడలో నెక్లెస్.. చెవులకు ఝుంకాళతో చాలా సింపుల్​ జ్యువెల్లరీ ధరించినా.. గ్రాండ్​ లుక్​లో సందడి చేసింది. ఆలియా ఫొటోలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. తల్లయిన తర్వాత ఆలియా అందం మరింత పెరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version