అలియా భట్ ఆసుపత్రి ఖర్చు రోజుకు ఎంతో తెలిస్తే షాక్!

-

బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయిన రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమించుకొని, కొన్నేళ్లు డేటింగ్ చేసుకొని ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 2 నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రెగ్నెన్సీయ్ వచ్చిన తర్వాత కూడా సినిమా ప్రమోషన్స్​లో, ఈవెంట్స్​లో పాల్గొంది. ఇటీవల అలియాభట్​కి ఘనంగా సీమంతం కూడా నిర్వహించారు.

ముంబైలోని రణ్‌బీర్‌ ఇంట్లో  కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్యే అలియాభట్ సీమంతం నిర్వహించారు. అలియా, రణబీర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

అయితే అలియా భట్ ఈ అక్టోబర్ నెల చివరి వారం నాటికి బిడ్డకు జన్మనిస్తుందని వైద్యులు వెల్లడించారని సమాచారం. వైద్యులు అలా చెప్పడంతో అలియా భట్, రణ్ బీర్ ఇప్పటికే ఆస్పత్రిని ఫైనలైజ్ చేసుకున్నారని టాక్. ఆ ఆస్పత్రికి రోజుకు 15,000 రూపాయల చొప్పున చెల్లించనున్నారని తెలుస్తోంది. అలియా భట్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తక్కువ ఖర్చు ఉన్న ఆస్పత్రిలో పని చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. గిర్గావ్​లో ఉన్న సర్ హెచ్.ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో అలియా భట్ పేరు నమోదు చేసుకున్నట్లు ప్రముఖ మీడియా ద్వారా వెల్లడైంది.

అయితే పెళ్లికి ముందే అలియా భట్ గర్భవతి అయ్యారని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్​లతో అలియా భట్ బిజీగా ఉన్నారు. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని సినిమాలో కూడా అలియా భట్ నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version