రాయ్ పూర్ లో ప్లీనరి సమావేశాలకు ఏర్పాట్లు సిద్ధం

-

ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు రాయ్పూర్లో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు మూడు రోజులు జరగనున్న ప్లీనరీ సమావేశాలకు ఏఐసీసీ సన్నాహాలు చేపడుతుంది. ఇందుకోసం ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం కోసం ఢిల్లీ రావాలని రాష్ట్రాల అధ్యక్షులు, ఇంచార్జ్లకు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఏఐసీసీ సభ్యుల జాబితా ఖరారు, ప్లీనరీ అజెండాపై చర్చించనున్నారు.

కేంద్రంలోని ఎన్డీఏ, తెలంగాణ‌లోని టీఆర్ఎస్ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తామ‌ని టీపీసీసీ నేత‌లు చెప్పారు. రేపు తెలంగాణ‌లోని ప్ర‌తి నియోజ‌క వ‌ర్గంలో ఓ నేత ఇందులో పాల్గొనాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, బ‌ట్టి విక్ర‌మార్క‌, మ‌ధుయాష్కీ స‌హా ఇత‌ర నేత‌లు పాల్గొనాల‌ని నిర్ణ‌యించారు. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని రోజుల్లో 50 నియోజ‌క వ‌ర్గాల్లో పర్యటిస్తారు.

ఇప్ప‌టికే రూట్‌ మ్యాప్ పై కాంగ్రెస్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. నాలుగు కారవాన్లను స‌న్న‌ద్ధం చేశారు. జనరేటర్లు, సౌండ్‌ సిస్టమ్ వాహ‌నాల‌ను కూడా వాడ‌నున్నారు. రాహుల్ గాంధీ నిర్వ‌హించిన భార‌త్ జోడో యాత్ర‌కు మంచి స్పంద‌న రావ‌డంతో అదే ఉత్సాహాన్ని కొన‌సాగిస్తూ హాథ్ సే హాథ్ జోడో కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది..

 

 

Read more RELATED
Recommended to you

Latest news